ETV Bharat / state

శుద్ధి కేంద్రాలకే జీవ వ్యర్ధాలు.. కొవిడ్‌ ఆస్పత్రులకు ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు - kurnool district latest news

కొవిడ్‌ ఆసుపత్రుల్లోని జీవ వ్యర్ధాలను ఇకపై కర్నూలు జిల్లాలోని జీవ వ్యర్థాల ఉమ్మడి నిర్వహణ (సీబీఎండబ్ల్యూటీఎఫ్‌) కేంద్రాలే సేకరించనున్నాయి. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వ్యర్థాల్ని సేకరించకుండా చూడాలని నగరపాలక, పురపాలక సంఘాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొవిడ్‌-19 వ్యర్థాలు మున్సిపల్‌ డంప్‌ యార్డులోక్లి రాకుండా నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

bio waste
బయో వ్యర్థాలు
author img

By

Published : May 11, 2021, 4:49 PM IST

కర్నూలు జిల్లాలో 601 ఆసుపత్రులు, క్లినికల్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 318 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే జీవ వ్యర్థాలు రోజూ వేల కిలోల్లో ఉంటున్నాయి. కరోనా రెండో అల క్రమంలో జిల్లాలో 23 ప్రైవేట్‌ ఆసుపత్రులను కొవిడ్‌ చికిత్సకు అనుమతి ఇచ్చారు. గత నెల ద్వితీయార్థం నుంచి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. మొదట్లో దాదాపు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు జరిగాయి. జీవ, వైద్య వ్యర్థాలన్నీ ఆయా మున్సిపాల్టీల్లోని డంపింగ్‌ యార్డులకు చేరాయి.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు కరోనా రోగులకు వినియోగించిన మందులు, వ్యర్థాలు, పీపీఈ కిట్లను రోడ్ల మీదనే నిర్లక్ష్యంగా పాడేశారు. మరికొన్నింటిని మున్సిపాల్టీ చెత్త బుట్టల్లో వేశారు. కొన్నింటిని నేరుగా చెత్త సేకరించే వాహనాలకు అందించారు. దీనిపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో జీవ వ్యర్థాలను కేవలం సీబీఎండబ్ల్యూటీఎఫ్‌ కేంద్రాలకు మాత్రమే అప్పగించాలనే స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ప్రత్యేకించి కరోనా చికిత్సలను అందించేందుకు అనుమతులు ఉన్న ఆసుపత్రులు వారి పేర్లను కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మొబైల్‌ యాప్‌లో నమోదు చేసుకుని వ్యర్థాలను అప్పగించాల్సి ఉంటుంది.

జిల్లాలో ఇష్టారాజ్యం...

జీవ వైద్య వ్యర్థాలు హానికరం. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు వ్యర్థాలను వాటిని సేకరించే ఏజెన్సీకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల, కర్నూలు లాంటి ప్రాంతాల్లోనే కొద్దిరోజుల క్రితం వీటిని చెత్తతో కలిపి పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. కొన్ని వ్యర్థాలను రహదారులు, మురుగు కాల్వల్లో వేశారు. నంద్యాల పట్టణంలోని మూడు ప్రైవేటు ఆసుపత్రులు ఇలాగే వ్యవహరించడంతో సమీప ప్రాంతాల ప్రజలు అభ్యంతరం తెలుపడంతో పాటు పురపాలక అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కర్నూలులో కూడా ఇలాంటి ఫిర్యాదులే అందాయి. నంద్యాలలో నివాస ప్రాంతంలో ఉన్న నర్సింగ్‌ హోం ఒకటి వ్యర్థాలను ఇళ్ల మధ్యనే వేస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుద్ధ్య కార్మికులు సేకరించడం లేదు

ఆస్పత్రుల్లో జీవ, వైద్య వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు సేకరించడం లేదు. ఈ వ్యర్థాలను సేకరించడం కోసం ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులు వ్యర్థాలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వ్యర్థాలను ఏజెన్సీకి మాత్రమే ఇవ్వాలని తాఖీదులు జారీ చేస్తున్నాం. - వెంకటకృష్ణ, పురపాలక కమిషనర్‌, నంద్యాల

కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి రోజుకు 1100 కిలోలు..

జిల్లాలోని కర్నూలు నగరంలో 17, నంద్యాలలో ఐదు, ఆదోనిలో ఒకటితోపాటు కర్నూలు సర్వజన ఆసుపత్రి, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు కర్నూలు, నంద్యాల, ఆదోనిలోని కొవిడ్‌ కేంద్రాల్లో ప్రస్తుతం కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని 23 ప్రైవేట్‌ కరోనా ఆసుపత్రుల నుంచి రోజుకు సగటున 600 కిలోల వరకు జీవ వ్యర్థాలు వస్తున్నాయి. కర్నూలు సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి, ఆదోనిలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరో 100 కిలోల వరకు వ్యర్థాలు వెలువడుతున్నాయి.

కర్నూలు, నంద్యాల, ఆదోని కొవిడ్‌ కేంద్రాల ద్వారా వైద్యులు, వైద్య సిబ్బంది ఉపయోగించే పీపీఈ కిట్ల వ్యర్థాలు వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ రకాల క్లీనిక్‌లు, ఆరోగ్య సంబంధ కేంద్రాల ద్వారా రోజుకు 400 కిలోల వరకు వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటన్నింటినీ మెడికల్‌ వేస్ట్‌ పొల్యూషన్‌ ఏజెన్సీ మాత్రమే సేకరించనుంది. సేకరించిన వైద్య వ్యర్థాలన్నీ కర్నూలుకు చేరుకున్న తర్వాత అక్కడే సురక్షిత పద్ధతుల్లో, పర్యవేక్షణలో దహనం చేయనున్నారు.

కరోనా బులిటెన్‌

జిల్లావ్యాప్తంగా సోమవారం నమోదైన కేసులు: 948

చికిత్స పొందుతున్నవారు: 9,717

ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు: 93,646

కోలుకున్నవారు: 83,328

ఇప్పటివరకు కొవిడ్‌తో చనిపోయినవారు: 601

ఇదీ చదవండి:

'కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు అనుమతి పొందాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.