తమ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, డోన్ పట్టణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసివేశారు. ఆళ్లగడ్డ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద ఉద్యోగులు వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. డోన్ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వారంలో ఐదు రోజుల పనిదినాలు, ఫ్యామిలీ పెన్షన్ను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలులో బ్యాంక్ ఉద్యోగుల ధర్నా
కర్నూలు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. బ్యాంకుల ముందు నినాదాలు చేస్తూ... వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, డోన్ పట్టణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసివేశారు. ఆళ్లగడ్డ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద ఉద్యోగులు వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. డోన్ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వారంలో ఐదు రోజుల పనిదినాలు, ఫ్యామిలీ పెన్షన్ను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సంరక్షకుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి'