ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.... ప్రభుత్వానికి అందరం సహకరిస్తామని ఏపీ ఎన్డీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కర్నూలులో తెలిపారు. 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అదనంగా రెండు సంవత్సరాలకు పెంచాలని ఆయన పాలకులను కోరారు. హైదరాబాద్ తో సమానంగా రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఉద్యోగులు అందరూ సహకరిస్తారని స్పష్టం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంలో ఉన్న లోపాలను సవరించాలని... లేని పక్షంలో ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
ఇవి చదవండి...వృత్తి ప్రభుత్వ ఉద్యోగం.. ప్రవృత్తి కవిత్వం