క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం.. క్రీడారంగంలో నూతనోత్తేజాన్ని తీసుకువస్తుందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతంగా రాణించే సత్తా ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక మరుగున పడుతున్న యువ క్రీడాకారులకు.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం భరోసాను కల్పిస్తుందంటున్నారు. ఈ నిర్ణయంతో తలిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రతిభవంతులను ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుందని.. సీఎం ప్రకటించడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. వర్థమాన క్రీడాకారులకు ఈ పరిణామం ప్రయోజనకరంగా ఉంటుందని.. పలువురు క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులతోపాటు, క్రీడా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భవిష్యత్ యువ క్రీడాకారులకు భరోసా కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలూ క్రీడాకారులకు అనేక హామీలిచ్చాయని.. కానీ వాటి అమలులో కచ్చితంగా వ్యవహరించలేదని తల్లిదండ్రులు, శిక్షకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అర్హులకు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :