ETV Bharat / state

12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు - ap government latest news

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అదే రోజున ముఖ్యమంత్రి జగన్ పుష్కర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

tungabhadra pushkar
tungabhadra pushkar
author img

By

Published : Nov 18, 2020, 6:59 PM IST

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరు 20 తేదీ మధ్యాహ్నం 1.21 నిముషాలకు పుష్కరాలు ప్రారంభం అవుతాయని... డిసెంబరు ఒకటో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు.

ఈ ఏడాది అక్టోబరు 11వ తేదీన విశాఖలో జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో తుంగభద్రా నదీ పుష్కరాల ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కర్నూలు వెళ్లనున్నారు. పుష్కరాల కార్యక్రమాలకు హాజరై అదే రోజున సాయంత్రం 4 గంటలకు విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు.

ఇదీ చదవండి:

డిసెంబర్​ ​25న ఇళ్ల స్థలాల పంపిణీ... సీఎం జగన్ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.