ETV Bharat / state

'ఇంట్లోనే వివేకా హత్య.. సాక్ష్యాలు తారుమారు'

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మాచాని సోమప్ప సర్కిల్​లో తెదేపా ప్రచార ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్రంపై భాజపా,  వైకాపా, కేసీఆర్‌ కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఐపీఎస్​ల బదిలీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు
author img

By

Published : Mar 27, 2019, 1:41 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు
వైఎస్ వివేకా హత్య.. ఆయన ఇంట్లోనే జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాక్ష్యాలు బయటికి రాకుండా తారుమారు చేసి ఉంటారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మాచాని సోమప్ప సర్కిల్​లో తెదేపా ప్రచార ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్రంపై భాజపా, వైకాపా, కేసీఆర్‌ కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తననేమీ చేయలేరని తేల్చి చెప్పారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేసిన ఘనత తెదేపాదని గుర్తు చేసిన సీఎం... ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ ఇంతటితో ఆగదనీ... ఇకముందూ కొనసాగిస్తానని భరోసా కల్పించారు. తనకు అండగా కోటిమంది డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారని చెప్పారు. రైతులకు రూ.24,500 కోట్లు రుణవిముక్తి కల్పించింది తామేనన్నారు. ఆర్డీఎస్‌, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి... అభివృద్ధి కొనసాగాలంటే, జాబు కావాలంటే బాబు మళ్లీమళ్లీ గెలవాలని స్పష్టం చేశారు.

నేరచరిత్ర కలిగిన వ్యక్తి మనకు అవసరమా?

వైకాపా నాయకుల తీరును చంద్రబాబు ఎండగట్టారు. నేరస్థులు రాజకీయాల్లో ఉండడం అవసరమా? అని ప్రశ్నించారు. జగన్‌ ఎప్పుడూ లోటస్‌పాండ్‌లోనే ఉంటారన్నారు. ఆయన్ను శాశ్వతంగా లోటస్‌పాండ్‌లోనే ఉంచుదామని ఓటర్లకు పిలుపునిచ్చారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి, కేసీఆర్‌కు వేసినట్లేనని చెప్పారు. మరోసారి తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ఈసీకి తగదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.