ETV Bharat / state

"తెదేపా హయాంలోనే యురేనియం తవ్వకాలకు అనుమతి" - allagadda

ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే బిజేంద్రా రెడ్డి అన్నారు. తెదేపా హయాంలోనే వీటికి గ్రీన్​సిగ్నల్ వచ్చిందని స్పష్టం చేశారు.

బిజేంద్రా రెడ్డి
author img

By

Published : Sep 29, 2019, 11:50 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో జరుగుతున్న యురేనియం అన్వేషణను తాము వ్యతిరేకిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడారు. యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. 2018లో తెదేపా ప్రభుత్వం హయాంలోనే అనుమతులు వచ్చాయని ఆరోపించారు. అప్పుడు తవ్వకాలకు పచ్చజెండా ఊపిన వారే ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆళ్లగడ్డ ప్రాంతంలో ఖనిజ అన్వేషణకు విమానాలు, హెలికాఫ్టర్లు తిరిగాయని ఆరోపించారు. అప్పుడు ఏమి చేయలేని తెదేపా నాయకులు ఇప్పుడు యురేనియం తవ్వకాలకు వైకాపానే కారణమంటూ బురద జల్లుతున్నారని విమర్శించారు. యురేనియం కోసం తవ్వకాలు జరుగుతుంటే తప్పక అడ్డుకుంటామని బిజేంద్రా రెడ్డి అన్నారు.

మీడియా సమావేశంలో బిజేంద్రా రెడ్డి

Intro:_ap_ap_rjy_61_30_mahilalu_andolana_av_ap10022Body:తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట(మండలం)లోని కోనేటి చెరువు వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులతో గ్రామానికి చెందిన మహిళలు వాగ్వివాదానికి దిగారు. షాపు యజమాని తమపై చేయి చేసుకున్న పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.దీని వల్ల ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారిపై తగు చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ రాంబాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మహిళలకు మద్దతు తెలిపారు. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.