కర్నూలు జిల్లా మద్దికేర మండలం అగ్రహారం గ్రామంలోని బీసీ కాలనీలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బందికి తెలిపినప్పటికి వారి నుంచి స్పందన కరవైంది. విసుగు చెందిన గ్రాామస్థులు మద్దికేర విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ... విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గ్రామంలో సరఫరా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఓ వైపు వర్షం, మరో వైపు చీకట్లో పాములు, ఇతర విష పురుగులు ఇళ్ళల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేాశారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి
చింతకొమ్మదిన్నెలో విషాదం.. బిస్కెట్లు తిని బాలుడు మృతి
మద్దికేర విద్యుత్ కేంద్రం ముట్టడి
కర్నూలు జిల్లా అగ్రహారం గ్రామస్థులు మద్దికేర విద్యుత్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. గత రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఆదివారం సాయంత్రం విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించారు.