ETV Bharat / state

సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి - kurnul news

acid-attack-in-kurnool
యువకుడిపై యువతి యాసిడ్ దాడి
author img

By

Published : Sep 4, 2020, 10:07 AM IST

Updated : Sep 5, 2020, 3:26 AM IST

10:06 September 04

కర్నూలు జిల్లాలో యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసిన యువతి

యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ఒకరు లేకపోతే మరొకరు బతకలేమన్నంతగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అడ్డుచెప్పటంతో కలసి బతకాలనే నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇకపై ఒకరి జీవితంలో మరొకరు ఉండొద్దనుకున్నారు. ఇంతలో ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంతో కోపం పెంచుకున్న యువతి... యాసిడ్‌తో దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించింది.  

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెడ్డకొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర... అదే గ్రామానికి చెందిన సుప్రియను ప్రేమించాడు. మూడేళ్లుగా ప్రేమించుకున్నవారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కులాలు వేరు కావటంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. అప్పటి నుంచీ ఒకరి జీవితంలో మరొకరు ఉండొద్దనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం నాగేంద్ర పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని సుప్రియ... నాగేంద్రపై యాసిడ్‌తో దాడి చేసింది.  

యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేంద్ర.... నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుప్రియ అంగీకారంతోనే వివాహం చేసుకున్నానని, గతంలో బకాయి పడ్డ డబ్బులనూ తిరిగిచ్చేశానీ వెల్లడించాడు. ఇంటి ముందు నుంచి వెళ్తుండగా... వెనుక నుంచి వచ్చి దాడి చేసిందని, వారం రోజుల క్రితం కూడా చేతిపై యాసిడ్‌ పోసిందని తెలిపాడు.  

తనకు చెప్పకుండానే నాగేంద్ర పెళ్లి చేసుకున్నాడని సుప్రియ తెలిపింది. భార్య అంటే ప్రేమ లేదనే ఇప్పటికీ చెబుతున్నాడని, తనతో మాట్లాడాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. ఊరిలో తన పరువు పోయిందని, జీవితం  నాశనం కావటం వల్లనే దాడి చేశానని వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇరువురినీ ప్రశ్నిస్తున్న పోలీసులు... దాడికి దారితీసిన పరిస్థితులపై కుటుంబసభ్యులను ఆరా తీస్తున్నారు.  

ఇదీ చదవండి: 

కాన్పు కోసం వెళ్తే కొవిడ్‌ అన్నారు.. మృతదేహం అప్పగించారు

Last Updated : Sep 5, 2020, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.