ETV Bharat / state

నేలకొరిగిన 100 ఏళ్ల చెట్టు - పాలధార, పంచధార వార్తలు

మహా వృక్షాలతో నిండి ఉండే శ్రీశైలం ప్రాంతలో 100 ఏళ్లనాటి చెట్టు నేలకొరిగింది. ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, పర్యటకులకు కలత మిగిల్చింది.

A tree that fell down in the rain winds at srisailam temple near paladhara, panchadhara in kurnool

author img

By

Published : Apr 22, 2020, 7:37 PM IST

శ్రీశైలానికి సమీపంలోని పాలధార - పంచదార వద్ద మహా వృక్షం నేలకొరిగింది. పెనుగాలులు వీచిన కారణంగా.. ఈ మహావృక్షం కూలిపోయింది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో విశేష చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో.. పచ్చదనానికి, రమణీయతకు నిలయమైన ఈ ప్రాంతంలో ఇంతటి మహా వృక్షం ఇలా పడిపోవడం.. ప్రకృతి ప్రేమికులను, మల్లన్న భక్తులనే కాదు.. సామాన్యులనూ కలచి వేస్తోంది.

అద్వైతమూర్తి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆరవ శతాబ్దంలో శ్రీశైలంని పర్యటించి ప్రకృతి రమణీయత కలిగిన పాలధార-పంచదార ప్రదేశంలో తపస్సు చేశారని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లపై శివానందలహరి, సౌందర్యలహరి అనే ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. ఈ కారణంగా శ్రీశైలాన్ని దర్శించే భక్తులు, పర్యటకులు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని సందర్శించడం పరిపాటి. ఇలాంటి చోట నేలకొరిగిన మహా వృక్షం.. భక్తులకు వేదన మిగిల్చింది.

ఇదీ చదవండి:

కరోనా కోరల్లో కర్నూలు జిల్లా....కొత్తగా 10 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.