ETV Bharat / state

అలా ప్రారంభించారు.. ఇలా మూసేశారు.. నిరాశలో ప్రజలు - అట్టహాసంగా ప్రారంభమైన సైన్స్ థీమ్ పార్క్‌

Science Theme Park In Kurnool: అభివృద్ధి చేశామని నిరూపించుకోవటానికి ప్రభుత్వం హడావిడిగా ఓ పార్కును నిర్మించింది. ప్రజాప్రతినిధులు కూడా రిబ్బన్ కట్ చేసి పావురాలను గాల్లోకి వదిలారు. పార్కులోని వివిధ అంశాలను విద్యార్థులకు వివరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. వచ్చిన నాయకులు అలా వెళ్లిపోయారో లేదో ఇలా పార్క్‌ను మూసేశారు. ప్రారంభానికే తప్ప వినియోగానికి వీలులేని సైన్స్ థీమ్‌ పార్క్‌ను మీరు చూడాలనుకుంటే ఆ జిల్లాకు వెళ్లాల్సిందే..

Science Theme Park Shut Down In Kurnool
కర్నూలులో సైన్స్ థీమ్ పార్క్‌
author img

By

Published : Apr 6, 2023, 1:55 PM IST

Updated : Apr 6, 2023, 2:25 PM IST

అలా ప్రారంభించారు.. ఇలా మూసేశారు.. నిరాశలో ప్రజలు

Science Theme Park Shut Down In Kurnool : కర్నూలులోని సైన్స్ థీమ్ పార్క్‌ను ప్రజా ప్రతినిధులు ఎంత అట్టహాసంగా ప్రారంభించారో కానీ ఈ ముచ్చట మూడ్రోజులు కూడా లేకుండా పోయింది. మార్చి 31న ప్రారంభించినప్పటికీ ఇంతవరకు దీనిని వినియోగంలోకి తీసుకురాలేదు. కర్నూలు నగరంలోని 20వ వార్డు గఫూర్ నగర్‌లో కర్నూలు నగరపాలక సంస్థ కోటి 87 లక్షల రూపాయలు ఖర్చు చేసి సైన్స్ థీమ్ పార్కును అభివృద్ధి చేసింది.

సైన్స్.. చక్కటి వాతావరణం : శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా దీనిని తీర్చి దిద్దారు. అందరినీ ఆకట్టుకునేలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వివిధ అంశాలకు సంబంధించిన చిత్రాలు, నమూనాలు రూపొందించారు. వీటితో పాటు పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు కూడా పెంచారు. మేయర్ బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు ఈ పార్కును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

నిన్న ప్రారంభించారు.. ఈరోజు మూసివేశారు : ఈరో సైన్స్ పార్క్ అందుబాటులోకి వచ్చిందని దిప పత్రికల్లో చూసిన కర్నూలు వాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ పార్క్ ప్రారంభోత్సవం అయిన వెంటనే దానిని మూసివేశారు. పార్కులో విలువైన వస్తువులు ఉన్నందున వాటిని సంరక్షించడం కష్టమవుతుందని భావించి తాళం వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో పార్కును నిర్మించినప్పటికీ వినియోగానికి వీలు లేకుండా చేశారంటూ వాపోతున్నారు.

పార్కును వినియోగంలోకి తీసుకురండి : ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సైన్స్ థీమ్‌ పార్క్‌ను త్వరలోనే వినియోగానికి తీసుకురావాలని కర్నూలు వాసులు కోరుతున్నారు.

"సైన్స్ పార్కును చూడటానికి వచ్చాము. ఈ పార్కును చూడటానికి పిల్లలు ఆసక్తితో వచ్చారు. ఇంకా ఓపెన్ చేయలేదు. మేము అడిగితే తరువాతి వారం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. తొందరగా తెరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ప్రారంభోత్సవం రోజు చూడటానికి అవకాశం దొరకలేదు. " - స్థానికుడు

"ఈ సైన్స్ పార్కు సెంటర్ ఆఫ్ ది టౌన్​లో ఉంది. పార్కు బాగానే ఉంది. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. పిల్లలు చాలా ఆనందంగా వస్తున్నారు. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో వచ్చి రిలాక్స్ అవ్వడానికి, పిల్లలతో ఆడుకోవడానికి బాగుంటది. చాలా మంది ఓపెన్ అయ్యిందని అనుకుంటున్నారు." - స్థానికుడు

"పిల్లలు వచ్చి ఆడుకోని వెళ్లారు. ఈరోజు పిల్లలతో పాటి వచ్చాము. పార్కు మూసివేసి ఉంది. మరలా సోమవారం రమ్మంటున్నారు. తొందరగా తెలిస్తే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి దగ్గర్లో ఈ పార్కు ఉంది." - స్థానికురాలు

ఇవీ చదవండి

Last Updated : Apr 6, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.