ఫోన్ మాట్లాడుతున్నందుకు తండ్రి మందలించాడని మనస్థాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గాలేరు - నగరి సమీపంలో చోటు చేసుకుంది. మృతురాలు అనూష(15) తెలంగాణకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
పొట్టకూటికోసం గాలేరు - నగరి కాలువ లైనింగ్ పనులు చేసేందుకు తండ్రి రాములు తో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గురువారం యువతి గాలేరు - నగరి కాలువ సమీపంలో కాలిపోయి శవమై కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిన్న రాత్రి.. వారు నివసిస్తున్న గుడిసెలో ఎవరూ లేని సమయంలో ఓ చెంబులో డీజిల్ తీసుకెళ్లి నిప్పంటించుకున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: