ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. దుకాణానికి వెళ్లిన ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలోనే చిన్నారి తండ్రి అక్కడకు చేరుకోవడంతో కామాంధుడి ఘాతుకం బయటపడింది. దీనిపై పాప తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగుచూసింది.
పట్టణంలోని నారాయణ గుంతలో చంద్రన్న అనే వ్యక్తి కిరణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇంటి నుంచి చంద్రన్న షాప్‌కి బాలిక వెళ్లింది. దుకాణానికి వెళ్లి చాలా సమయం అయిన ఇంకా రాకపోవడంతో చిన్నారి తండ్రి దుకాణనికి వెళ్లి చూడగా.. బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ చంద్రన్న కనిపించాడు. దీంతో వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబీకులు పట్టణ రెండో పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అరెస్ట్ చేశారు. షాప్‌కి వెళ్లిన వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడని.. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన చంద్రన్నను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి
MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు!