'స్పందన'లో ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం - latest news of spandana programme at kurnool dst
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కింటి వారితో మనస్పర్థల కారణంగా...తన కుటుంబంపై కేసులు పెట్టారంటూ పత్తికొండ మండలం బుగ్గతాండకు చెందిన పాండురంగనాయక్ బలవన్మరణానికి యత్నించాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించే తన భర్తను పోలీసులు మానసికంగా వేధిస్తున్నారని బాధితుడి భార్య కన్నీరుమున్నీరైంది.