కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామంలో... పొలం విషయంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరికొకరు కొడవళ్ళతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గ్రామానికి చెందిన చిన్న గోరంట్ల, ఎల్ల మద్దయ్య కుటుంబాల మధ్య 2011 నుంచి పది ఎకరాలకు సంబంధించి పొలం వివాదం ఉంది. తాజాగా... ఒక వర్గం వారు పొలంలోకి వెళ్లి దున్నే క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట.. మాట పెరిగి ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. గాయపడిన వారిని డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాల వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: