వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ నిధులు జమ చేయనున్నారు. 2 లక్షల 48 వేల 468 మంది లబ్ధిదారులకు 248 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం లభించనుంది.
గతేడాది 2 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా.. ఈ ఏడాది కొత్తగా 42 వేల 932 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి