ETV Bharat / state

ఆ యువత ఫీజులు చెల్లించేది మామిడి తోటే

వారందరూ నిన్నటి వరకు పుస్తకాలు పట్టుకుని చదువుకున్నారు. వేసవికాలం సెలవులు రావటంతో మామిడి తోటల్లో కూలీలుగా మారారు. అందరూ కుటుంబాన్ని పోషించేందుకు పనిచేస్తారు. కానీ ఈ విద్యార్థులు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించేందుకు పనివాళ్లుగా మారారు. కూలి చేసిన డబ్బులతో చదువుకుంటున్నారు తిరువూరు యువత.

వారి కాలేజీ ఫీజుకు మామిడి తోటే ఆధారం
author img

By

Published : Apr 29, 2019, 7:16 AM IST

ఆ యువత ఫీజులు చెల్లించేది మామిడి తోటే

ఒకరు ఇంటర్​ చదివి డిగ్రీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.... మరొకరు డిగ్రీ పూర్తయి విశ్వవిద్యాలయంలో పోస్ట్​ గ్రాడ్యుయేట్​ చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు చదువుకోవాలంటే కళాశాల ఫీజులు చెల్లించాలి. పుస్తకాలు పట్టుకుని చదువుకునేందుకు విద్యాలయాలకు వెళ్లిన విద్యార్థులు... హఠాత్తుగా మామిడి తోటల్లో కూలీలుగా మారారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో మామిడి తోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో రసాలు, బంగినపల్లి రకాల మామిడి వేల ఎకరాల్లో సాగు చేస్తారు. తిరువూరు యువతకు ఈ తోటలే ఉపాధి కల్పిస్తున్నాయి. రోజుకు 4 వందల రూపాయల వరకు ఆర్జిస్తుంటారు. వేసవి కాలం పూర్తయ్యే సరికి ఒక్కొక్కరు 10 నుంచి 15 వేల వరకు సంపాదిస్తారు. వచ్చిన నగదును ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగిస్తామని చెప్తున్నారు.
చెట్లపైకి ఎక్కి మామిడి కాయలు కోయటం, వాటిని వాహనాల్లోకి ఎక్కించే అన్ని రకాల పనులు చేస్తుంటారు. తోటల్లో పనులు చేసేందుకు విద్యార్థులు రాకతో యజమానులకు కొంత ఊరట లభిస్తుంది. వేసవికాలం సెలవులు వృథా చేయకుండా పనిచేయటం తమకు ఎంతో ఆనందంగా ఉంటుందని యువత చెపుతున్నారు.

ఇదీ చదవండీ :

రణ్​బీర్.... సరదాగా కాసేపు

New Delhi, Apr 27 (ANI): The employees continued protest after debt-ridden Jet Airways was grounded. On Saturday, employees and their families took out a candle march at Delhi's Jantar-Mantar. Protestors demanded Government's help to resume the airline. The struggling employees were accompanied by their children.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.