కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో తనను పెళ్లి చేసుకొని ఆదరించడం లేదంటూ.. భర్త ఇంటిముందు యువతి అబీదా నిరాహార దీక్ష చేపట్టింది. 8 సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకొని ..ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత.. భార్య నాకు వద్దంటూ నడిరోడ్డు మీద వదిలివేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని .. మహిళా సంఘాలతో కలిపి అత్తవారి ఇంటి దగ్గర బిడ్డతో సహా బైటాయించింది. పలుసార్లు పోలీసుల వద్ద పంచాయతీ నిర్వహించినా.. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనకు న్యాయం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు వాపోతోంది.
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం