కృష్ణా జిల్లా అవనిగడ్డలో భర్త ఇంటి ముందు.. ఓ భార్య మౌన పోరాటానికి దిగింది. మణికంఠ అనే యువకుడు.. వైష్ణవి అనే యువతిని నవంబర్ 5, 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి యువకుడు వైష్ణవిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోయిన యువతి వైష్ణవిని బంధువులు రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. వివాహం తరువాత కవలు పుట్టాక భార్యను విడిచి వెళ్లిపోయాడు.
ఇద్దరు పిల్లలతో భర్త ఇంటికి వెళ్లిన వైష్ణవిని మణికంఠ కుటుంబీకులు.. ఇంటి నుంచి బయటకు తోసేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు యువతి, తన ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సదరు యువతి నుంచి వివరాలు సేకరించారు. దీనిపై వారు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Kanipakam: కాణిపాకం ఆలయంలో పాత రథ చక్రానికి నిప్పు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!