ETV Bharat / state

ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాల్లో బీఎల్వోలకు వసతుల కొరత - ప్రజలకు తప్పని అవస్థలు - ఎన్టీఆర్ జిల్లా నందిగామ

Voter Awareness Campaign : ఓటు నమోదు చేసుకోవాడానికి, మార్పులు, చేర్పులకు ఎన్నికల అధికార యంత్రాంగం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా బీఎల్వోలు ప్రజలకు అందుబాటులో ఉండాలని. కానీ అందుకు విరుద్ధంగా బీఎల్వోల జాడ పోలింగ్ బూత్​లో అసలు లేదు. బీఎల్వోలు ఒకవైపు కనీస వసతులు లేకపోవడం, మరోవైపు అధికార పార్టీ ఒత్తిడి కారణంగా విధులకు హాజరు కాలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.

voter_awareness_campaign
voter_awareness_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 4:30 PM IST

Voter Awareness Campaign : ఈ నెల 2,3 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్​లలో ఓటరు నమోదు, జాబితాల సవరణ, మార్పులు, చేర్పుల నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఓ ప్రకటన తెలిపినా విషయం విదితమే. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి, ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు చేసిన దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించిన విషయం తెలిసిందే. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో పలు చోట్ల ఉదయం 10 గంటలు కావస్తున్నా బీఎల్వోలు జాడ లేదు. పలుచోట్ల అరకొరకగా సిబ్బంది హాజరయ్యారు.

మీ ఓటు చెక్​ చేసుకోండి - 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు, తనిఖీ కార్యక్రమం

Neglect of BLO staff in Krishna district : అలాంటి వాతావరణమే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఒక బూత్​లో నెలకొంది. పలుచోట్ల అరకొరగా బీఎల్వో సిబ్బంది హాజరయ్యారు. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల బీఎల్వో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు పాఠశాలలో బూత్​లు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

Neglect of BLO Staff in NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల తర్వాత బీఎల్వోలు అందుబాటులో ఉన్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో 10 పోలింగ్ బూతులు ఉండగా 9 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వీరిలో ఒకరు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. జిల్లా పరిషత్ పాఠశాలలో బీఎల్వోలు కూర్చోవడానికి విద్యార్థుల చేత కుర్చీలు, బల్లలు వేయించారు. దాం బాస్కో స్కూల్​లో చెట్ల కింద కూర్చొని బీఎల్వోలు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం ఆవరణలో బిఎల్వోలు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. పలు కేంద్రాల్లో 10గంటలు దాటినా కూడా బీఎల్వోలు విధులకు హాజరు కాలేదు. వీరి కోసం ఓటర్లు ఎదురు చూస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

SEO Voter Awareness Campaign : 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువతను ఓటర్లుగా నమోదు చేసేలా, వీరికి ప్రత్యేకంగా ఇనిస్టెంటు ఎన్​రోల్​మెంటు నిర్వహించనున్నట్లు కేెంద్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. వయసు ధ్రువీకరణ పత్రాలతో నూతన ఓటర్లు నమోదు కావాలని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఓటరు కార్డు కలిగి ఉన్న వారు తప్పుల సవరణ, మార్పుల చేర్పులకు బూత్ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.

Citizens for Democracy Awareness Campaign : ఎన్నికల సంఘం డిసెంబరు 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఓటర్ల జాబితా ఇంటింటి పరీశీలన కార్య క్రమాన్ని అందరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో అందరూ భాగస్వాములు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు. బీఎల్వో ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఫారం6 ద్వారా ఓటును నమోదు చేసుకోవాలని సూచనలు చేశారు. ఫారం 8 ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు వేర్వారు బూత్​లో ఉంటే వాటిని ఒకే బూత్ జాబితాలోకి మార్చుకోవచ్చన్ని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో అవతవకలు జరిగి ఓటు కొల్పోయిన పక్షంలో హైకోర్టును ఆశ్రయించి తిరిగి పొందవచ్చని పిలుపునిచ్చారు. ఎలాంటి తప్పులు తావు లేకుండా ఓటు జాబితాను రూపొందించడానికి అధికారులకు, ఓటర్లకు సహకరించేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల సానుభూతిదారుల ఓట్ల ఏరివేతకు 'ఫామ్-7' వాడుతున్న వైసీపీ నేతలు - ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుల ఆగ్రహం

ఓటరు అవగాహన కార్యక్రమంలో బీఎల్వోల నిర్లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.