గ్రామ సచివాలయ నియామకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల కానుందని చెప్పారు. 13 శాఖల్లో 11రకాల ఉద్యోగాలకు ఈ వారంలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. అభ్యర్థుల వయో పరిమితి, పోస్టుల సంఖ్య, సిలబస్ని వీలైనంత త్వరగా ఖరారు చేస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ సచివాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు.
ఇదీ చదవండి :'ట్రిపుల్ ఐటీతో విద్యార్థుల కలలు సాకారం'