పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలున్నా ఇంధనం ధరలు తగ్గించేందుకు ఒక్కరూ కృషి చేయకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి: కరోనా భయం: వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు