ETV Bharat / state

ఈనెల 18న విజయవాడ మేయర్‌ ఎన్నిక - విజయవాడ మేయర్‌ ఎన్నిక వార్తలు

ఈనెల 18న విజయవాడ మేయర్‌ ఎన్నిక జరగనుంది.జిల్లా కలెక్టర్ ఆధ్వరంలో ఈ ప్రక్రియ జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అనివార్య కారణాల వల్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడితే... మరుసటిరోజు అంటే 19న ప్రక్రియ తిరిగి నిర్వహించేలా షెడ్యూలు ఇచ్చింది. ఆదివారం కౌంటింగ్‌ పూర్తయ్యాక గెలిచిన అభ్యర్థులతో పాటు ఎక్స్‌అఫిషియోలకు నోటీసులు ఇవ్వనున్నారు.

ఈనెల 18న విజయవాడ మేయర్‌ ఎన్నిక
ఈనెల 18న విజయవాడ మేయర్‌ ఎన్నిక
author img

By

Published : Mar 13, 2021, 4:29 AM IST

విజయవాడ మేయర్‌ ఎన్నిక ఈనెల 18న జరగనుంది. అత్యధిక డివిజన్లు గెలుచుకున్న రాజకీయపక్షం అభ్యర్థుల నుంచి ...మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వరంలో ఈ ప్రక్రియ జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అనివార్య కారణాల వల్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడితే... మరుసటిరోజు అంటే 19న ప్రక్రియ తిరిగి నిర్వహించేలా షెడ్యూలు ఇచ్చింది. ఆదివారం కౌంటింగ్‌ పూర్తయ్యాక గెలిచిన అభ్యర్థులతో పాటు ఎక్స్‌అఫిషియోలకు నోటీసులు ఇవ్వనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ను ...గెలిచిన సభ్యులు సభలో చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు. ఒక పార్టీ నుంచి ఆ పదవుల కోసం ఒక్కొక్కరు చొప్పున మాత్రమే పోటీలో ఉంటే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇతర పార్టీ నుంచి ఆ పదవుల కోసం పోటీలో నిలిచిన పక్షంలో సభ్యుల మద్దతు అధికంగా ఎవరికి ఉంటుందో వారే మేయర్, డిప్యూటీ మేయర్‌ అవుతారు.

ఇవీ చదవండి

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బు పంచుతున్న ఉపాధ్యాయుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.