శాస్త్ర సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప....అవి వారిని బానిసలుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో యలవర్తి నాయుడమ్మ వ్యాసాలు, ప్రసంగాల పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. నాయుడమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం ద్వారా శాస్త్ర పరిజ్ఞానం ఎక్కడికి చేర్చాలన్న విషయం అర్థమవుతుందన్నారు. స్పష్టమైన లక్ష్యాలు, విలువలతో సాగిన నాయుడమ్మ జీవితం ఎన్నో సవాళ్లకు పరిష్కారాలను చూపిందన్నారు.
ఈ సందర్భంగా ప్రచురణ సంపాదకులు డా. కె చంద్రహాస్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, నాయుడమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ డా. డి.కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Venkaiah Naidu: "ఛైర్మన్ అంటే...పిన్నమనేని కోటేశ్వరరావులా ఉండాలి"