ఆలయాల్లో దాడుల అంశంపై అవసరమైతే గవర్నర్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. సీఎం జగన్ ఘటనా స్థలికి వెళ్లాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులు కాబట్టి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయా? అని వర్ల రామయ్య నిలదీశారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేకాట ఆడితే తప్పు లేదు అని అన్న మంత్రి కొడాలి నానిని.. కేబినెట్ ఉంచాలో? లేదో? సీఎం తేల్చుకోవాలని వర్ల రామయ్య అన్నారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ఆలయాల్లోనే దాడులు.. రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి...