ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబుల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నూజివీడు పట్టణంలోని మల్లాది ఏసుదాసు ప్రాంగణంలో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో కొత్తగా సంభవించిన మార్పులు, కరోనా ప్రభావంతో విద్యారంగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు , ఉపాధ్యాయ సమస్యల పై విస్తృత స్థాయి చర్చ జరిపినట్లు ఆయన తెలిపారు. పీఆర్సి వెంటనే చెల్లించాలని.. సీపీఎస్ రద్దు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
'సుప్రీంకోర్టు తీర్పు మేరకు వ్యవహరిస్తాం'
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పు మేరకే ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ సిబ్బంది పాత్ర ఉంటుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: "ఆలసించిన ఆశాభంగం.. సొంతింటి కల తీర్చుకునేందుకు ఇదే అవకాశం"