ETV Bharat / state

రెండు లారీలు-కారు ఢీ.. క్యాబిన్​లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు - accident at ibrahimpatnam national highway news

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

road accident
రోడ్డు ప్రమాదంలో ఢీకొన్న వాహనాలు
author img

By

Published : Nov 21, 2020, 3:06 PM IST

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేక్​ వేయటంతో వెనుక వస్తున్న రెండు లారీలు.. ఒక కారు ఢీ కొన్నాయి. లారీ కిందకి కారు చొచ్చుకుపోయింది. లారీల డ్రైవర్లు క్యాబిన్​లో ఇరుక్కుపోయారు. గాయపడిన వారిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇదీ చదవండి: మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం... బూడిదైన సామగ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.