కృష్ణాజిల్లా జిల్లా చల్లపల్లిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖాజావలి వెల్లడించారు. వైరస్ సోకిన వారికి అన్ని సౌకర్యాలు ఉంటే... హోం ఐసొలేషన్లో ఉండొచ్చని తెలిపారు. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా ఉంటే... ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని.... అత్యవసరమైతే తప్పా బయటకి రావద్దని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ