ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు స్వామి వారి ఆశీర్వచనం అందించారు. సచివాలయం మెుదటి బ్లాకులోని సీఎస్ ఛాంబర్లో టీటీడీ వేద పండితులు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్‌కు స్వామి తీర్థ ప్రసాదాలు అందించి.. ఆశీర్వచనం పలికారు.
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.. ఇతర ఉన్నతాధికారులు సీఎస్‌కు నూతన సంవత్సల శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌కు ఆశీర్వాదం:
నూతన సంవత్సరం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు