కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద వీధిలో కొలువై ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నులపండుగగా జరిగాయి. అమ్మవారికి ఐదువందల మంది మహిళలు పెద్ద కాలువ నుండి బిందెలతో జలాలు తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహించారు. 13 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికార్లు వెల్లడించారు.
ఇదీచూడండి.సచివాలయ పరీక్ష... త్వరగా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయాస!