ఇల్లు కొనుగోలు చేస్తానంటూ వచ్చి వృద్ధురాలిని రివాల్వర్‌తో బెదిరించి హైటెక్ చోరీ చేసిన ఉదంతం కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ కాకతీయ నగర్‌లో అమ్మకానికి పెట్టిన ఇంటిని కొనుగోలు చేస్తానంటూ వచ్చి.. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళ వద్ద నుండి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు.
దాదాపు 9 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత వృద్ధురాలు తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతం గుడివాడ శివారు కావడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: