ETV Bharat / state

వారి కోసం పోలీస్​శాఖ ప్రత్యేక పాస్​లు జారీ - ఏపీ పోలీసు శాఖ

అత్యవసర పనులు కోసం వెళ్తున్న వారికి లాక్​డౌన్​తో ఇబ్బంది కలగకుండా రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ప్రత్యేక పాస్​లు జారీ చేస్తోంది. ఇవి కావాల్సిన వారు పూర్తి వివరాలతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ap police
ap police
author img

By

Published : Apr 14, 2020, 3:00 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో వైద్యం, ప్రభుత్వ విధులు, ఇతర అత్యవసర పనుల కోసం వెళ్తున్న వారు ఇబ్బందులు పడకుండా అత్యవసర పాసులు జారీ చేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. అనుమతి పత్రాల జారీకి జిల్లాలు, ముఖ్య నగరాలకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్లు, ఈ- మెయిళ్లను ఏర్పాటు చేసింది. అత్యవసర పాసులు కావాలనేవారు సంబంధిత జిల్లాలకు కేటాయించిన వాట్సాప్ నంబర్లు, ఈ - మెయిల్ ఐడీకి పూర్తి పేరు, చిరునామా, ఆధార్‌ కార్డు నంబరు, వాహన నంబరు, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధారంగా పాస్​లు దరఖాస్తు చేసుకున్న వాట్సాప్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఇతరుల నంబరు, మెయిల్ నుంచి పంపితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని డీజీపీ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అనుమతి పత్రం పొందిన వారు గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని, తప్పుడు సమాచారమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 20 వేల జనతా బజార్లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.