ETV Bharat / state

సరికొత్త ఆలోచనలకు ఆహ్వానం... అంకుర సంస్థలకు కేంద్రం ప్రోతాహ్సం - విజయవాడలో మలి తరం ఆలోచనల పోటీ

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల (ఎస్‌టీపీఐ) ఏర్పాటులో భాగంగా మలి తరం ఆలోచనల పోటీ (నెక్ట్స్‌ జెన్‌ ఐడియా ఛాలెంజ్‌ కాంటెస్ట్‌) మంగళవారం ప్రారంభమైంది. విజయవాడలో ఈ పోటీలు నిర్వహించారు.

The Next Gen Idea Challenge Contest started in vijayawada as part of the establishment of stpi
సరికొత్త ఆలోచనలకు ఆహ్వానం
author img

By

Published : Aug 26, 2020, 8:32 AM IST

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల (ఎస్‌టీపీఐ) ఏర్పాటులో భాగంగా మలి తరం ఆలోచనల పోటీ (నెక్ట్స్‌ జెన్‌ ఐడియా ఛాలెంజ్‌ కాంటెస్ట్‌) మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించారు. విద్య, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్‌, సప్లై ఛైన్‌, లాజిస్టిక్స్‌, మెడికల్‌ హెల్త్‌కేర్‌, డయాగ్నోస్టిక్‌, ప్రివెంటివ్‌, సైకలాజికల్‌ కేర్‌ తదితర విభాగాల్లో కరోనా అనంతర పరిస్థితులను ఎదుర్కొనేలా వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులు, పరిష్కారాలను సూచించే అంకుర సంస్థలను ఎంపిక చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో 300 అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.60 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించనుంది.

ఇదీ చదవండి:

స్వర్ణ ప్యాలెస్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.