కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ - వెలివోలు గ్రామాల మధ్యలో కృష్ణానది ఎడమ కరకట్ట కేఈబీ కాలువలో రెండు మూటలలో మృతదేహం కలకలం రేపింది. కాలువలో మూటలున్నాయని చల్లపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మూటలను విప్పి చూడగా అందులో మృతదేహం రెండు భాగాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
కాగా అంతకుముందు అగినపర్రు గ్రామానికి చెందిన దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని చంపి ఆ కాలువలో పడవేసినట్లు కూచిపూడి పోలీస్ స్టేషన్లో గరికే ఏడుకొండలు అనే వ్యక్తి లొంగిపోయాడు.
పోలీసులు ఆ కోణంలో విచారిస్తూ నాంచారయ్య కుటుంబ సభ్యులను నిమ్మగడ్డ లాకుల వద్దకు తీసుకొచ్చారు. ఆ శవం నాంచారయ్యదేనని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఏడుకొండలు కుమారుడు నాగరాజు ఈ హత్యలో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Ramya Murder case : 'ప్రేమించాలంటూ వేధించాడు... కాదన్నందుకు కడతేర్చాడు'