ETV Bharat / state

వంటింటి మహారాణులు... నెట్టింట్లో విజేతలు

ఇంటికే పరిమితమైన గృహిణులు.. సామాజిక మాధ్యమాల ద్వారా అర్జిస్తున్నారు. నూతన ఆలోచనలతో వీడియోలు రూపొందిస్తూ లక్షల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమ ప్రతిభకు సాంకేతికతను జోడించి ఇంట్లో కూర్చొనే ఉపాధి పొందుతున్నారు.

యూట్యూబర్స్
author img

By

Published : Jul 10, 2019, 9:34 AM IST

వంటింటి మహారాణులు... నెట్టింట్లో విజేతలు

ఆలోచన ఉంటే సంపాదించటం తేలికని నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన నలుగురు గృహిణులు. య్యూటూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. చిన్న చిన్న సలహాలు, చిట్కాలు అందిస్తూ యూట్యూబర్స్​గా రాణిస్తున్నారు.

అందానికి చిట్కాలు
స్వాతి.. ఓ సాధారణ గృహిణి. పెళ్లికి ముందు హైదరాబాద్​లో ఉద్యోగం చేసి.. వివాహం తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. 2017లో స్టయిల్ విత్ ఫ్యాషన్ పేరుతో హిందీలో యూట్యూబ్ ఛానల్​ను ప్రారంభించారు. మారుతున్న జీవనశైలి.. అందానికి తీసుకోవాల్సిన చిట్కాలను దృశ్య రూపంలో చిత్రీకరించి వీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్ చేశారు. ఏడాది కాలంలోనే అనూహ్యమైన స్పందన లభించింది. రెండున్నర లక్షల మంది స్వాతి నిర్వహించే ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఈ ఉత్సాహంతో తెలుగులో మరో ఛానల్​ను ప్రారంభించారు .

కొత్త రకం వంటలు నేర్పుతూ
విజయవాడకు చెందిన మరో గృహిణి స్వప్న... యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తరకం వంటలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. బీఎస్సీ చేసిన స్వప్న తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్​తో విహహం అనంతరం... స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి తనకు ఇష్టమైన అంశాలపై వీడియోలను చిత్రీకరించి అప్​లోడ్ చేశారు. అనంతరం కొత్త రకం వంటలను నేర్పుతూ.. అందరకీ మంచి రుచిని అందించేందుకు స్వప్న కిచెన్ పేరుతో మరో ఛానల్​ను ప్రారంభించారు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు .

ఆరోగ్యం అందరికీ
చిన్న వయస్సులోనే మధుమేహం, థైరాయిడ్​, ఊబకాయం ఆమెను వేధించాయి. అయినా పట్టుదలతో బరువు తగ్గి నిరూపించింది క్రాంతి. తనలాగే అందరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని.. డైట్ ఛాలెంజ్​ను ప్రారంభించారు. క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్​ను ప్రారంభించి.. వీరమాచినేని ఆహార నియమాలను దృశ్యరూపంలో చిత్రీకరించి అప్​లోడ్ చేశారు. 15 నెలల కాలంలోనే ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందారు.

నిరుద్యోగులకు సలహాలిస్తూ
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తూ ఎడ్యుటైన్​మెంట్ అకాడమి పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్​ను ప్రారంభించారు ప్రియాంక. చదువుతో పాటు ఉద్యోగావకాశాలను వివరిస్తూ వీడియోలు చేశారు. సాధారణంగా అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వీటిపై తన య్యూటూబ్​ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు.

వీరందరూ గృహిణులుగా ఉంటూ నూతన ఆలోచనలను ఆవిష్కరించారు. రోజుకు 3 నుంచి 4 గంటల పాటు సమయం కేటాయించి నెలకు 30 నుంచి 40 వేల రూపాయలను ఆర్జిస్తున్నారు. తాజాగా నిర్వహించిన సౌత్ సోషల్ మీడియా అవార్డ్స్ లో బహుమతులను సాధించారు.

New Delhi, July 09 (ANI): The Congress party, which is yet to recover from Lok Sabha election drubbing, is facing new issues each day and the latest leader to raise an alarm is Urmila Matondkar. The actor-turned-politician has claimed that failure of party leadership at local level and infighting in its Mumbai unit created "hurdles and obstacles" in her political campaigning during national polls. In a nine-page letter to then Mumbai Congress chief Milind Deora dated May 16, Matondkar stated, "Personal ego issues and complete lack of political maturity displayed by certain key party functionaries of Mumbai North constituency and Mumbai Congress created an atmosphere of distrust and confusion in the entire political campaign. It had a negative and adverse impact on the day-to-day campaigning as well as affected the moral of grass root level party workers." Other key functionaries such as Bhushan Patil failed to hold meetings between key functionaries of the party at block level and ward level which resulted in complete failure of communication," read the letter which has now surfaced on social media. Matondkar claimed while saying that she fought the elections with sincerity and integrity in her constituency. Matondkar has also claimed that there were constant disputes raised by key-functionaries about financial matters, adding that there was a complete breakdown and failure of table management and system of appointing agents at polling centres on voting day. Concluding her letter, the Congress leader proposed and suggested, "A strong disciplinary action be taken against Sandesh Kondwilkar and Bhushan Patil forthwith and changes be made at organisational level with immediate effect to ensure a better and brighter future for the organisation." Matondkar, who contested her debut election from Mumbai North constituency, lost to BJP leader Gopal Shetty by 4,65,000 votes. The Shiv Sena-BJP alliance had trounced the Congress in Mumbai, bagging all the six seats.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.