రాష్ట్రంలో ఇంటింటికీ స్వయంగా వ్యాక్సిన్ వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
భయాందోళనలతో గుంపులు..
వ్యాక్సినేషన్ ఇక ఉండదేమో అనే భయాందోళనలతో ప్రజలు టీకా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున్న గుమిగూడుతున్న ఓ వీడియోను తన ట్విట్టర్‌కు జత చేశారు. వ్యాక్సిన్ విషయం దేవుడెరుగు కానీ రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో మాత్రం ఈ దృశ్యం కొవిడ్ విజృంభణకు పరాకాష్టగా మారిందని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'ఆంధ్రప్రదేశ్ రకం వైరస్ బలహీనమైనదే'