సీనియర్ ఐఎఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు కీలకమైన శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మత్స్య, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆమెను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అటు మత్స్య, పశు సంవర్ధకశాఖ అదనపు బాధ్యతలు కూడా పూనం మాలకొండయ్యకే అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీచూడండి.ఆవు చేలో మేస్తే..దూడ గట్టున మేస్తుందా..? నారా లోకేశ్