కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం సమీపంలో కృష్ణానది కరకట్టపై కారు ప్రమాదం జరిగింది. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్న కోసూరి శ్రీనివాసరావు తన భార్య, కుమారుడితో కలిసి అవనిగడ్డకు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందగా... మృతుడి కుటుంబ సభ్యులను స్థానికులు కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి