ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచేందుకు రాష్ట్ర పరిశోధన మండలి ఏర్పాటు చేయాలని.. ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. కోటి రూపాయల నిధులతో ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉన్నత విద్యామండలి పరిధిలోనే పరిశోధన మండలి పని చేయనుంది. దీనికి ప్రత్యేకంగా డైరెక్టర్‌ను నియమిస్తారు.
సెర్చ్‌కమిటీ ద్వారా డైరెక్టర్‌ను ఎంపిక చేయనున్నారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధనలు చేయాల్సిన రంగాలపై వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు ఈ మండలి మార్గ నిర్దేశం చేస్తుంది. పరిశోధనలకు అవసరమయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఇతర సంస్థల నుంచి సేకరిస్తుంది. పరిశోధన ప్రాజెక్టులను సేకరించి, విద్యాసంస్థలకు కేటాయిస్తుంది.
ఇదీ చూడండి:
viveka murder case: 51వ రోజు సీబీఐ విచారణ... మృతదేహాన్ని శుభ్రం చేసి కట్లు కట్టిన వైద్యులకు ప్రశ్నలు