Accused Arrested in Murder Case in Eluru District: ఇటీవల కాలంలో ఆస్తుల కోసం ఎంత కిరాతకానికైనా పాల్పడుతున్నారు. రక్త సంబంధీకులనే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం సంచలనం రేకెత్తించిన జంట హత్య కేసును మండవల్లి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు.
మండవల్లి గన్నవరానికి చెందిన రోయ్యూరు సుబ్బారావుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య నాంచారమ్మకు నగేష్ అనే కుమారుడు ఉన్నాడు. నాంచారమ్మ సొంత చెల్లి అయిన భ్రమరాంబను సుబ్బారావు రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు సురేశ్ అనే మరో కుమారుడు ఉన్నాడు. మొదటి భార్య కుమారుడు నగేష్ బాబు వారి తాత నాగలింగం ఉమ్మడి ఆస్థి 41 సెంట్లు పొలం, 192 గజాల ఇంటి స్థలం విషయమై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
నగేష్ బాబు ఆస్థి మొత్తం తనకే ఇచ్చేయాలని గొడవ పడుతూ ఇవ్వకపోతే చంపి ఆస్థిని లాక్కుంటానని బెదిరించాడు. ఈ నేపధ్యంలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సురేశ్, భ్రమరాంబ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ముద్దాయి రొయ్యూరు నగేష్ బాబు వారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి సురేష్ భార్య గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 48 గంటలలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కేసును చేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
విధి ఆడిన వింత నాటకం - ప్రమాదం చూసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది
ఒకేసారి ఎనిమిది మృతదేహాల రాకతో తీవ్ర ఉద్వేగానికి గురైన గ్రామస్థులు