మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని బ్రోకర్ అంటూ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలను బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆర్థికమంత్రిగా ఎన్నో సంస్కరణలకు నాంది పలికి.. రాష్ట్ర ప్రగతికి బంగారు బాటలు వేసిన యనమలను కించపరచడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వారు మండిపడ్డారు. బలహీనవర్గాలపై జరుగుతున్న దాడి, చేసిన విమర్శలపై ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం విడ్డూరమన్నారు. మూడు రోజుల్లో మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీచూడండి."పవన్ గారూ.. మీ పిల్లలతో ఏ భాషలో మాట్లాడుతున్నారు?"