ETV Bharat / state

రూ.5 లక్షలు.. గూడుకోసం కూడబెడితే 'చెదల' పాలయ్యాయి..!

పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్యకు బ్యాంక్​లో అకౌంట్​లేదు. వ్యాపారంలో వచ్చిన లాభాలను ట్రంకు పెట్టెలో భద్రపరిచాడు. ఇల్లు కట్టుకుందామని రూ.పది లక్షలు పోగు చేయాలని అతని కోరిక. ఇప్పటి వరకు సుమారు రూ.5లక్షలు జమ చేశాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి రూ.లక్ష కట్టాల్సి వచ్చింది. డబ్బుకోసం ట్రంకు పెట్టెను తెరిచాడు. లోపలున్న నోట్లను చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. అసలు ఏం జరిగిందంటే..!

author img

By

Published : Feb 16, 2021, 6:52 PM IST

Termites ate rs.5 lakhs stored
చిత్తుకాగితాలుగా చేసిన చెదలు
ట్రంకు పెట్టెలో రూ.5 లక్షలు

సొంత గూడు నిర్మాణం కోసం కూడబెట్టిన డబ్బు.. చెదలు పట్టి చిత్తుకాగితాల్లాగా మారింది. కృష్ణా జిల్లా మైలవరంలో పందుల వ్యాపారం చేసుకునే జమలయ్య..తన వద్ద ఉన్న డబ్బును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. రూ.పది లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు రూ.5లక్షలు దాచిపెట్టాడు. అయితే వ్యాపారం కోసమని దాచిపెట్టిన వాటిలో నుంచి లక్ష రూపాయలు తీసుకునేందుకు ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నారు. ట్రంకు పెట్టెలో ఉన్న నోట్లను చెదలు తినేశాయి. కూడబెట్టుకున్న డబ్బు చిత్తుకాగితాల్లాగా మారడంతో కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసుల ఎదుట జమలయ్య కుటుంబ సభ్యులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఆసక్తికరంగా గన్నవరం పంచాయతీ రాజకీయాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.