పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను మోకాళ్లపై నడిపించిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. పట్టణంలోని నెహ్రూచౌక్ సెంటర్లోని ఎస్పీఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విధిస్తున్న శిక్షలపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారన్న కారణంతో వ్యాయామ ఉపాధ్యాయుడు మోకాళ్లపై నడిపించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఉపాధ్యాయుడిని సంప్రదించగా... విద్యార్థులకు ఎటువంటి శిక్షలు విధించలేదని, వ్యాయామం చేయిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీచదవండి.