ETV Bharat / state

నిబంధనల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటారని ఎలా చెప్తున్నారు: ఎమ్మెల్సీ - ఎమ్మెల్సీ అశోక్ బాబు తాజా వార్తలు

వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. నిబంధనల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటారని సజ్జల ఎలా చెబుతారని ప్రశ్నించారు.

tdp mlc ashok babu
tdp mlc ashok babu
author img

By

Published : Jul 20, 2020, 6:42 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, గవర్నర్​ల మధ్య ఏం జరిగిందో తెలియకుండానే సజ్జల రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం చూపారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే గవర్నర్ నడుచుకుంటారని ఆయనెలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సజ్జల ఏం మాట్లాడారో ప్రజలకు అర్థం కాలేదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుకి రాజధాని అమరావతిపైనే ప్రేమెక్కువ, మిగతా ప్రాంతాలపై లేదనే ముందు.. సజ్జల నిజాలు తెలుసుకోవాలని అశోక్ బాబు మండిపడ్డారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన, పులివెందులకు నీళ్లివ్వడం, చిత్తూరులో శ్రీసిటీ, అనంతపురంలో కియా ఏర్పాటు ఏ ప్రాంతంపై అభిమానంతో చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఎవరి ప్రాంతమని కట్టారని నిలదీశారు. విశాఖకు లులూగ్రూప్, ఆదానీ గ్రూప్ లను ఎందుకు తీసుకొచ్చారన్నారు. వీటన్నీటికి సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: వైకాపాలో మోసపోయానంటూ మీడియా ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.