ETV Bharat / state

పంట నష్టం వివరాలు సేకరించి.. పరిహారం చెల్లించండి: తెదేపా

author img

By

Published : Nov 27, 2020, 4:38 PM IST

నివర్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలంలో నీట మునిగిన పంటలను దేవినేని ఉమా పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించి సత్వరమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

పంట నష్టం వివరాలు సేకరించి..పరిహారం చెల్లించండి: తెదేపా

నివర్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండంలోని రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి గ్రామాల పరిధిలో నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందని.., ప్రభుత్వ పంట నమోదు ప్రకారం వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కౌలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకోవాలి

గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో నీట మునిగిన వరి పొలాలను తెదేపా నేతలు సందర్శించారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

పరిహారం అందించటంలో ప్రభుత్వం విఫలం

గత వరదల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాకినాడ తెదేపా పార్లమెంట్ ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ విమర్శించారు. ఇప్పుడు నివర్ తుపాను కారణంగా రైతులు నష్టపోతే...క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ప్రభుత్వం అరకొరగా పరిహారం అందించే చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

జనవరి నాటికి పంట నష్ట పరిహారం చెల్లించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.