రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. నకిలీ పత్రాలు సృష్టించారంటూ సుధాకర ఇన్‌ఫ్రాటెక్‌పై.... జేపీ పవర్ వెంచర్స్ ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేరంటూ ప్రశ్నించారు. అలాగే అదే సంస్థకు గోదావరి డ్రెడ్జింగ్ కాంట్రాక్టును సీఎంఓ ఎందుకు సిఫారసు చేసిందని నిలదీశారు. జేపీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న మంత్రి వెల్లంపల్లి సోదరుడు సహా ఇతరులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
ఇదీ చూడండి: DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి