కొవిడ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ తెదేపా నిరసనలు కొనసాగుతాయని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బుధవారం 630 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో విజ్ఞాపనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కొవిడ్ వల్ల నష్టపోయిన వారి కుటుంబాల పట్ల ప్రభుత్వ వైఫల్యం తెదేపా నిరసన కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపించింది. పేద, మధ్య తరగతి వర్గాల బాధను ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. చిరువ్యాపారులు, రైతులు, డ్రైవర్లు, చేతి, కులవృత్తుల వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కొవిడ్ మరణాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. బాధిత కుటుంబాలను సమీకరించి వాస్తవాలను ప్రభుత్వం ముందుంచేందుకు తెదేపా చేపట్టిన మిస్డ్ కాల్ ప్రచారం ప్రారంభించిన 36గంటల్లో 2,740 మంది స్పందించారు." అని వెల్లడించారు.
ఇదీ చదవండి: