ETV Bharat / state

'కంపెనీలు పోయాయి.. యువత నిర్వీర్యం అయ్యింది.. ఇంకా ఎన్నో' - వైకాపా ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు విమర్శలు

వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలోని వచ్చిన కంపెనీలు వెనక్కు వెళ్లిపోయాయని.. యువత నిర్వీర్యమైందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పులివెందుల ముఠాతో విశాఖ వచ్చిన పెట్టుబడిదారుల్ని హింసిస్తున్నారని ఆరోపించారు. యువతలో ఉండే ఫైర్​ను సద్వినియోగం చేసుకోవడం తెలియక.. వారిని వాలంటీర్లగానూ, తోపుడు బళ్లు లాగేవారిగానూ మార్చేశారని మండిపడ్డారు.

ayyanna patrudu
అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు
author img

By

Published : Dec 14, 2020, 12:48 PM IST

గత 18 నెలలుగా రాష్ట్రం నుంచి 200కు పైగా కంపెనీలు వెళ్లిపోయాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. యువతను నిర్వీర్యం చేసి వాలంటీర్లగాను, తోపుడుబళ్లు నడిపే వాళ్లగాను, మద్యం దుకాణాల్లో ఉద్యోగులుగా నియమించారని మండిపడ్డారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసులోని యువతలో ఉండే ఫైర్​ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వైకాపా ప్రభుత్వానికి తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ayyanna patrudu tweet
అయ్యన్న పాత్రుడు ట్వీట్

చంద్రబాబు కృషితో వచ్చిన పెట్టుబడులు, ఉద్యాగాలను మంత్రే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారంటూ సంబంధిత ఫోటోలను తన ట్విట్టర్​కు అయ్యన్న జతచేశారు. విజయసాయిరెడ్డి పెట్టుబడుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖలో పులివెందుల ముఠాని దించి, అనేకమంది పెట్టుబడిదారుల్ని హింసిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కంపెనీలు పులివెందుల పంచాయతీ తట్టుకోలేక పారిపోయాయో అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి..

35 ఏళ్లకే తొలగిస్తే..ఎలా బతికేది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.