ETV Bharat / state

'ఎవడ్రా మనల్ని ఆపేది'..చంద్రబాబు, పవన్​ ఫొటోలతో వెలసిన ఫ్లెక్సీలు - TDP Janasena Flexi discusion in Krishna District

TDP Janasena Flexi: ఏదైనా పండగ వచ్చిందంటే చాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు వెలుస్తుంటాయి. తాజాగా సంక్రాంతి సందర్భంగా వైసీపీకి పోటీగా టీడీపీ, జనసేన అధినేతల ఫొటోలతో వెలసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఫ్లెక్సీలో కొటేషన్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 17, 2023, 11:25 AM IST

TDP Janasena Flexi: మనం వీధుల్లోకి వెళ్లగానే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది ఫ్లెక్సీలే. శుభకార్యం, శుభాకాంక్షలు, అశుభకార్యాలకు ఇలా ఒకటేమిటి వారి భావాలు అందరికీ తెలియజేయడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రస్తుత సమాజంలో సంప్రదాయంగా మారింది. కృష్ణా జిల్లాలో వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగుదేశం, జనసేన అధినేతల ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలు..ఎవడ్రా మనల్ని ఆపేది కొటేషన్లు

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు..: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో తెలుగుదేశం, జనసేన అధినేతల ఫొటోలతో వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయంశమయ్యాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఫోటోలను ఒకే ఫ్లెక్సీపై ఉంచి.. మధ్యలో 'ఎవడ్రా మనల్ని ఆపేది'.., 'తగ్గేదేలే' అంటూ కొటేషన్లు రాశారు. స్థానికంగా వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోటీగా వీటిని తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాహనదారులు, అటుగా వెళ్లేవారు... ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.