గురువారం జరిగిన విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని.. చీకటి కౌన్సిల్‌గా తెదేపా కార్పొరేటర్లు అభివర్ణించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉండబట్టే పోలీసుల పహారాలో కౌన్సిల్ నిర్వహించి, ప్రతిపక్షాల గొంతు నొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే, మేయర్ వుండగానే.. వైకాపా ఫ్లోర్ లీడర్ కనుసన్నల్లో సమావేశం జరగడం సిగ్గు చేటన్నారు. కౌన్సిల్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేయర్ విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో పని చేసిన మేయర్లను ఆదర్శంగా తీసుకుని విజయవాడ నగర పాలక సంస్థ అభివృద్ధికి దోహదం చేయాలని హితవు పలికారు. జీవో 198 రద్దు చేసి, ప్రజలపై ఆస్తి పన్ను భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.